యువతి మెదడులో 10 సెం.మీ నులిపురుగు

Tape Worm Found In China Girls Brain - Sakshi

బీజింగ్‌ : 23 ఏళ్ల యువతి మెదడులో 10 సెంటీమీటర్ల పొడవైన నులిపురుగు బయటపడింది. ఈ సంఘటన చైనాలోని నింజియాంగ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నింజియాంగ్‌కు చెందిన క్షియావో ఇ అనే యువతి గత కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతోంది. ఈ మధ్య ఎపిలిప్సీ( న్యూరలాజికల్‌  డిజార్డర్‌) అటాక్‌ చేసింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. క్షియావోకు పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె మెదడులో ఇన్ఫెక్షన్‌‌ సోకినట్లు గుర్తించారు. ఆ వెంటనే శస్త్ర చికిత్స మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె మెదడులో ఉంటున్న 10 సెంటీమీటర్ల నులిపురుగు వారు గుర్తించి, దాన్ని బయటకు తీశారు. సరిగా ఉడకని మాంసం తిన్నందు వల్లే నులిపురుగు ఆమెలోకి చేరిందని వైద్యులు తెలిపారు. ( చైనా: స్కూళ్లకు పిల్లలు.. వాళ్ల తలపై..)

ప్రస్తుతం క్షియావో పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. గత సంవత్సరం గాంఝౌకు చెందిన వాంగ్‌ అనే వ్యక్తి మెదడులోనూ 11 సెంటీమీటర్ల నులిపురుగు బయటపడింది. నత్తలు ఇష్టంగా తినటం వల్ల పురుగు అతడి మెదడులో చేరింది. 15 సంవత్సరాల పాటు అతడి మెదడును తింటూ బ్రతికింది. తల నొప్పితో ఆసుపత్రిలో చేరటంలో వైద్యులు నులి పురుగును గుర్తించి, శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీశారు. ( బెస్ట్ ఫ్రెండ్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన శున‌కం )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top