బైక్‌పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత | Suspected militant shot dead | Sakshi
Sakshi News home page

బైక్‌పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత

Mar 18 2017 12:14 PM | Updated on Sep 5 2017 6:26 AM

బైక్‌పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత

బైక్‌పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత

అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు కాల్చిచంపారు.

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఓ అనుమానిత ఉగ్రవాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు వెల్లడించారు.

నగరంలోని కిల్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌(ఆర్‌ఏబీ) యూనిట్‌ వద్దకు శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మోటార్‌ సైకిల్‌పై దూసుకొచ్చాడు. చెక్‌పోస్ట్‌ వద్ద సిబ్బంది ఆదేశాలను లెక్కచేయకుండా దూసుకొచ్చిన అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఉన్నటువంటి బ్యాగులో పేలుడు పదార్ధాలు గుర్తించామని ఢాకా మెట్రోపాలిటన్‌ పోలీస్‌(డీఎమ్‌పీ) అధికారులు వెల్లడించారు. బాంబు డిస్పోజల్‌ యూనిట్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఢాకాలోని ఓ ఆర్‌ఏబీ స్థావరం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో భద్రతను కట్టదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement