తెరవకుండానే చదివేస్తుంది! | Super Robo | Sakshi
Sakshi News home page

తెరవకుండానే చదివేస్తుంది!

Sep 11 2016 3:03 AM | Updated on Sep 4 2017 12:58 PM

తెరవకుండానే చదివేస్తుంది!

తెరవకుండానే చదివేస్తుంది!

రోబో సినిమాలోని చిట్టి తరహా రోబోట్‌ని నిజ జీవితంలో మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు.

రోబో సినిమాలోని చిట్టి తరహా రోబోట్‌ని నిజ జీవితంలో మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. పుస్తకంలో పేజీలు తెరవకుండానే అందులోని విషయాలను తెలుసుకునేందుకు ఓ వినూత్నమైన స్కానర్‌ను తయారు చేశారు. ఇది దాదాపు 9 పేజీల కట్టలో ఉండే అక్షరాలను ఒకేసారి గుర్తించగలదు. మైక్రో తరంగాలు, పరారుణ కాంతికి మధ్యలో ఉండే టెరాహెర్జ్ రేడియోధార్మికత సాయంతో ఈ స్కానర్ పనిచేస్తుంది.

కాగితానికి, దానిపై ఉన్న అక్షరాలకు మధ్య ఉన్న తేడాలను ఈ కాంతి గుర్తించగలదు. 2 కాగితాల మధ్య ఉండే సూక్ష్మమైన గాలిపొర ద్వారా ఈ టెరాహెర్జ్ కాంతి ప్రసారమైనప్పుడు వచ్చే మార్పులను సెన్సార్ల ద్వారా గుర్తిస్తారు. ఈ వ్యవస్థ పనిచేసేందుకు అవసరమైన కంప్యూటర్ అల్గారిథమ్స్‌ను ఎంఐటీ, జార్జియా టెక్  శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement