చిన్నమంటలు వ్యాపిస్తేనే వాటిని చూసి భయంతో బెంబేలెత్తిపోయి పరుగులు పెడుతుంటారు. అలాంటిది కార్చిచ్చు దూసుకొస్తుందంటే అక్కడ ఎవరైనా ఉంటారా?
పోర్ట్లాండ్ : చిన్నమంటలు వ్యాపిస్తేనే వాటిని చూసి భయంతో బెంబేలెత్తిపోయి పరుగులు పెడుతుంటారు. అలాంటిది కార్చిచ్చు దూసుకొస్తుందంటే అక్కడ ఎవరైనా ఉంటారా? కాని ఉన్నారు. ఒక పక్క భారీ మొత్తంలో అటవీ ప్రాంతాన్ని దహనం చేస్తూ నిప్పులు కక్కుతూ మంటలు దూసుకొస్తున్నా ఏమాత్రం చీకు చింత లేనట్లు కొంతమంది వ్యక్తులు గోల్ఫ్ అడుతూ కనిపించారు.
పోర్ట్లాండ్‌లోని కొలంబియా నది గుండా ఉన్నా అటవీ ప్రాంతాన్ని దహించుకుంటూ పెద్ద దావానలం వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అది 33,400 ఎకరాల అటవీ సంపదను బుగ్గిపాలు జేసింది. ప్రస్తుతం బెకాన్ రాక్ గోల్ఫ్ కోర్స్ వైపు ఆ కార్చిచ్చు వస్తున్నప్పటికీ అక్కడి వారు ఏమాత్రం భయపడకుండా ఎంత తాఫీగా గోల్ఫ్ ఆడుతున్నారో చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.