ఫుల్లుగా తాగారు.. ఆపై..!

In Sri Lanka UK Couple Buys Hotel Gets Drunk On Honeymoon - Sakshi

సాధరణంగా తాగి జీవితాలు నాశనం చేసుకునే వారి గురించే చదువుతుంటాం.. కానీ లైఫ్‌ సెట్‌ చేసుకున్న వారి గురించి ఎక్కడ చూడటం కాదు కదా కనీసం చదివి కూడా ఉండం. కానీ ఇలాంటి సంఘటనే ఒకటి శ్రీలంకలో జరిగింది. ఫుల్లుగా తాగిన ఓ కొత్త జంట ఏకంగా హనీమూన్‌ కోసం వెళ్లిన హోటల్‌నే కోనేశారు. వినడానికి కాస్తా విడ్డూరంగా అనిపించినా ఇది మాత్రం నిజం. కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది.  బ్రిటన్‌కు చెందిన గినా లైయాన్స్‌, మార్క్‌ లీలు తమ హనీమూన్ ట్రిప్‌ కోసం శ్రీలంకకు వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో దిగారు. ఫుల్లుగా తాగి ఎంజాయ్‌ చేస్తున్న వారికి ఓ వెరైటీ ఆలోచన వచ్చింది. రూమ్‌ రెంట్‌కు తీసుకోవడం కంటే ఏకంగా ఈ హోటల్‌నే కొంటే ఎలా ఉంటుంది అనుకున్నారు.

ఆలోచన రావడమే తడవుగా ఆ హోటల్‌ యాజమానుల దగ్గరకు వెళ్లారు. తమ ఆలోచన గురించి వారికి చెప్పారు. హోటల్‌ కూడా కాస్తా పాతబడటం.. త్వరలోనే దాని లీజ్‌ కూడా అయిపోతుండటంతో హోటల్‌ యజమానులు కూడా గినా, మార్క్‌ ప్రతిపాదనను అంగీకరించారు. అలా తాగిన మైకంలోనే బేరసారాలు కానిచ్చేశారు. అలా దాదాపు 30 వేల పౌండ్లు పోసి ఆ హోటల్‌ను మూడేళ్లకు తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో 29 లక్షల రూపాయలు. ఇంకేముందు.. వాళ్ల హనీమూన్ ట్రిప్ కాస్త బిజినెస్ ట్రిప్‌గా మారిపోయింది.


How #luckybeachtangalle was born! ❤️

A post shared by Lucky Beach (@luckybeachtangalle) on

అలా ఈ సంవత్సరం జులై 1 నుంచి ఆ హోటల్‌ని మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకొన్నారు.. దానికి ‘లక్కీ బీచ్ తంగళ్లె’ అనే పేరు పెట్టి దాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇక.. అప్పటి నుంచి టూరిస్టులు ఆ హోటల్‌కు క్యూ కడుతున్నారట. బాగుంది కదా ఐడియా.. తాగితే తాగారు కానీ.. మంచి బిజినెస్ దొరికింది.. అంతే కాదు వాళ్లు ఆ ఏరియాలో చిన్నపాటి సెలబ్రిటీలు అయ్యారు. వీరి బిజెనేస్‌ కూడా సక్సెస్‌ ఫూల్‌గా దూసుకుపోతుందంట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top