మరోసారి చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌

SpaceX Launches Crew Dragon Test Flight to Prove Tt can fly Humans Safely - Sakshi

స్పేస్‌ ఎక్స్‌ (స్పెస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌‌) మరోసారి చారిత్రాత్మక అత్యంత శక్తివంతమైన మానవ రహిత రాకెట్‌ను ప్రయోగాత్మకంగా లాంచ్‌  చేసింది.  ఫ్లోరిడా ఫ్లోరిడాలోని జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్‌ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ వరకు ఒక మానవరహిత క్రూడ్రాగన్‌ను శనివారం ప్రారంభించింది. స్పేస్ఎక్స్ రాకెట్ ఫాల్కన్-9 రెండవ దశలో భాగంగా దీన్ని లాంచ్‌ చేసింది. శక్తివంతమైన, పునర్వినియోగ రాకెట్ల రూపకల్పనతో,  ప్రయోగాలు నిర్వహిస్తూ ఇతర గ్రహాలపై మానవుల నివాసమే లక్ష్యంగా  స్పేస్ ఎక్స్ సాధించిన  ఇది గొప్ప మైలు రాయిగా  నిపుణులు భావిస్తున్నారు. 

ఇది తనకు చాలా సంతోషాన్నిస్తోందని స్పేస్‌ ఎక్స్‌ఫౌండర్‌ ఎలాన్ మస్క్ నాసా మీడియా సమావేశంలోభావోద్వేగంతో ప్రకటించారు. మాజీ వ్యోమగామి కెనెడీ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బాభ్‌ కబానా  కూడా  ఇది నిజంగా ఉత్తేజకరమైన సమయంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ను ప్రయోగంలో విజయం సాధించిన స్పేస్‌ ఎక్స్‌ పలుపరిశోధనల అనంతరం గత ఏడాది  ఉపగ్రహ ప్రయోగానంతరం స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్-9 సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ చేసి ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో గొప్ప ముందడుగు  వేసింది. వీటి ద్వారా చంద్రుడు, అంగారక గ్రహాల వద్దకు అంతరిక్ష యాత్రికులను తీసుకెళ్లాలని ఈ సంస్థ ప్రాణాళికలు రచిస్తోంది. అంతేకాదు, భూమికి సుదూరంలో ఉన్న బృహస్పతి, శని గ్రహాలకు మానవ రహిత(రోబోలు) యాత్రలు చేపట్టాలని కూడా స్పేస్ ఎక్స్ యోచిస్తోంది. తాజా ప్రయోగంతో ఈ ప్రక్రియ ఎంతో దూరంలో లేదని నిరూపించింది. 

కాగా టెస్లా ఇన్‌కార్పొరేషన్‌ సీఈవో ఎలాన్ మస్క్ 2002లో కాలిఫోర్నియాలో  స్పేస్‌ఎక్స్‌ సంస్థను స్థాపించారు. ప్రైవేటు రంగంలో అంతరిక్ష పరిశోధనలు సాగిస్తోన్న సంస్థతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైతం తన అవసరాల మేరకు ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top