కుప్పకూలిన విమానం.. ఆరుగురి మృతి | Six dead in US plane crash | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన విమానం.. ఆరుగురి మృతి

Aug 13 2016 11:57 AM | Updated on Apr 4 2019 5:12 PM

అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో ప్రైవేటు విమానం చెట్లలో కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.

అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో ప్రైవేటు విమానం చెట్లలో కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. షానన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ఈ విమానం ప్రయత్నిస్తుండగా కూలిపోయినట్లు వర్జీనియా పోలీసులు తెలిపారు. అయితే విమానం ఎందుకు కూలిపోయిందన్న విషయం ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నం చేసి, ఆ తర్వాత సాంకేతిక లోపాలతో ల్యాండింగ్ వదిలేసి ఉంటారని పోలీసు ప్రతినిధి లెస్ టైలర్ తెలిపారు.

తిరిగి ఎగిరేందుకు ప్రయత్నించే క్రమంలో చెట్లను ఢీకొందని, దాంతో మంటలు చెలరేగి అందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు మరణించారని చెప్పారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వాళ్లు వర్జీనియా ప్రాంతానికి చెందినవారు మాత్రం కాదని అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement