ట్రాఫిక్ అధికారి ముందే పసిగట్టాడు..హీరో అయ్యాడు | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ అధికారి ముందే పసిగట్టాడు..హీరో అయ్యాడు

Published Mon, Apr 25 2016 9:09 AM

ట్రాఫిక్ అధికారి ముందే పసిగట్టాడు..హీరో అయ్యాడు

అది నాలుగు కూడళ్ల రోడ్డు. సరిగ్గా నాలుగు నిమిషాల ముందు వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉన్న ప్రాంతం. వాహనాలను నియంత్రిస్తూ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారి రోడ్డుపై అటూ ఇటూగా నడుస్తూ ట్రాఫిక్ను నియంత్రిస్తున్నాడు. ఎంతో ఒత్తిడితో చేసే పని అయినా, బిజీగా తన పనిలో  ఉన్నా కూడా నాలుగు కూడళ్ల వద్ద రోడ్డు బీటలు రావడాన్ని ఆ అధికారి గమనించాడు. వెంటనే రోడ్డు పై అటూ ఇటూగా నడిచి ఎంత మేర వరకు ప్రమాదకరమో గుర్తించి ఆ ప్రాంతంలోకి వాహనాలు రాకుండా చుట్టూ మూసివేశాడు. సరిగ్గా కొద్ది నిమిషాల్లోనే ఆ అధికారి గుర్తించిన ప్రాంతం మొత్తం కుంగిపోయింది.

ఈ సంఘటన జెజియాంగ్ ప్రావిన్స్లోని హోంగ్జూలో చోటుచేసుకుంది. ఈ వీడియో అక్కడే ఉన్న సీసీకెమరాకు చిక్కింది. ప్రమాదాన్ని గుర్తించడం కొద్దిగా ఆలస్యమైతే పెను ప్రమాదం సంభవించిఉండేదని, సదరు అధికారిని ప్రపంచ మీడియాతో పాటూ, వీడియో చూసిన వారంతా రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement