
మెసేజ్‌లే కాదు ముద్దులూ పంపుకోవచ్చు!
ఎక్కడో ఉన్న ప్రియురాలికి/భార్యకు మెసేజ్‌లు, మెయిల్స్‌లా ఇక నుంచి ముద్దులు పంపించుకోవచ్చు.
లండన్: ఎక్కడో ఉన్న ప్రియురాలికి/భార్యకు మెసేజ్‌లు, మెయిల్స్‌లా ఇక నుంచి ముద్దులు పంపించుకోవచ్చు. దీనికోసం ‘కిసెంజర్’ అనే పరికరాన్ని లండన్ లోని సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఇందులో ఒత్తిడిని గుర్తించే సెన్సార్లు, ప్రేరేపితాలు ఉంటాయి. ఈ పరికరాన్ని మనం ముద్దాడితే మన పెదాలు దానిపై ఎంత ఒత్తిడిని కలిగించాయో, అంతే ఒత్తిడిని అవతలి పరికరం ద్వారా మన భాగస్వామికి కలిగించవచ్చు. స్మార్ట్‌ఫోన్ కు అనుసంధానం చేసుకుని ముద్దులను పంపించుకోవచ్చు.