అంత డబ్బులేదు బాసూ! | Semanda makes wedding with three | Sakshi
Sakshi News home page

అంత డబ్బులేదు బాసూ!

Jan 14 2018 12:59 AM | Updated on Jan 14 2018 12:59 AM

Semanda makes wedding with three - Sakshi

ఉగాండాకు చెందిన సెమాండా.. అక్కడి కటాబా అనే టౌన్‌లో రోడ్డుపై ఆహారపదార్థాలు అమ్ముకుంటూ ఉంటాడు. వయసు 50 ఏళ్లు. గత నెలలో ఆఫ్రికా మొత్తం సెమాండా పేరు వార్తల్లో ప్రముఖంగా కన్పించింది. ఎందుకంటే అతడు పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పెళ్లి చేసుకుంటే కూడా వార్తేనా అవాక్కవకండి! ఎందుకంటే ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకున్నందుకు వార్తల్లోకి ఎక్కలేదు..! ముగ్గురిని ఒకేసారి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆయన చెప్పిన సమాధానానికి అక్కడి జనం అవాక్కయ్యారు.

వార్తల్లో నిలిచాడు. ఆ సమాధానం ఏంటంటే.. ముగ్గురిని మూడుసార్లు పెళ్లి చేసుకునేంత డబ్బు తనవద్ద లేదని.. అందుకే ముగ్గురినీ ఒకేసారి చేసుకున్నానని చెప్పాడు. దీంతో ఫేమస్‌ అయిపోయాడు. మరి డబ్బే లేనప్పుడు ముగ్గురిని ఎలా పోషిస్తావు అని అడిగితే ‘‘వారికి నేనంటే ఇష్టం.. వారంటే నాకు చాలా ఇష్టం. నలుగురం బతికేందుకు ఇంకా ఇంకా కష్టపడతాను’ అని సమాధానం ఇచ్చాడు. ఆ ముగ్గురు భార్యల్లో ఒకరికి 48 ఏళ్లు.. మరో ఇద్దరికి 27, 24 ఏళ్లు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement