మరో భూమి.. మనకు దగ్గరలో!?

Scientists Discover Super Earth - Sakshi

భూమిని పోలిన మరో గ్రహం ఉందా? అక్కడ జీవరాశి మనుగడ సాధ్యమేనా? మన భూమి నుంచి ఎంత దూరంలో ఉంది? అక్కడకు మనం వెళ్లడం సాధ్యమేనా? అనే ప్రశ్నలకు అవునని.. సమాధానం చెబుతున్నారు పరిశోధకులు.

ఒట్టావా : భూమిని పోలిన మరో గ్రహాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 111 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉందని సైంటిస్టులు ప్రకటించారు. కొత్తగా గుర్తించిన ఈ గ్రహానికి కె2-18బీ అని సైంటిస్టులు నామకరణం​ చేశారు. భూమిని పోలిన ఈ గ్రహాన్ని కెనడాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు, యూనివర్సిటీ ఆఫ్‌ టొరొంటో పరిశోధకులు సంయుక్తంగా గుర్తించారు.

తాజాగా గుర్తించిన ఈ గ్రహంపై మంచుతో కూడిన రాళ్లు, పర్వతాలతో ఉందని ఉంటుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన రేయాన్‌ క్లుటీర్ తెలిపారు. యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీ (ఈఎస్‌ఓ) డేటాను విశ్లేషించే క్రమంలో ఈ గ్రహం గురించిన సమాచారం తెలిసిందని ఆయన తెలిపారు.

కే2-18బీ గ్రహం ఇంచుమించుగా నెఫ్ట్యూన్‌ గ్రహాన్ని పోలి ఉంటుందని రేయాన్‌ చెప్పారు. ద్రవ్యరాశి గురించిన సమాచారం లేదన్న ఆయన.. సూర్యుడి (అక్కడి పాలపుంతలో ఉండే నక్షత్రం) చుట్టూ తిరిగేందుకు 32.9 రోజుల సమయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ గ్రహం గురించి మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top