వైమానిక దాడులు.. 31మంది మృతి | Saudi-led coalition air raid kills 31 in Yemen | Sakshi
Sakshi News home page

వైమానిక దాడులు.. 31మంది మృతి

Aug 30 2015 6:39 PM | Updated on Jul 29 2019 5:43 PM

ఉగ్రవాదులను అణిచి వేసే క్రమంలో సౌదీ అరేబియా సమక్షంలో ఆదివారం జరిగిన వైమానిక దాడుల్లో 31మంది ప్రాణాలు కోల్పోయారు.

సనా: ఉగ్రవాదులను అణిచి వేసే క్రమంలో సౌదీ అరేబియా సమక్షంలో ఆదివారం జరిగిన వైమానిక దాడుల్లో 31మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17మంది అమాయక పౌరులు ఉండగా.. మిగితా 14మంది షితే హుతికి చెందిన ఉగ్రవాదులు. సౌదీ అరేబియాలోని హజ్జా వద్ద గల వాటర్ బాటిల్ కర్మాగారంలో తిరుగుబాటుదారులు తలదాచుకుని ఉన్నారన్న సమాచారం మేరకు సౌదీ సైన్యం దానిపై వైమానిక దాడులు జరిపింది.

ఒక్క ఆదివారమే ఈ ఫ్యాక్టరీ కాకుండా మొత్తం పన్నెండు చోట్ల వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో ఒక్క వాటర్ బాటీల్ కర్మాగారం వద్దే 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో కూడా సౌదీ సైన్యం ఉగ్రవాదుల కోసం నిర్వహించిన దాడుల్లో 65 మంది అమాయక ప్రజలు మృతిచెందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement