‘రష్యా ట్రంప్‌ సలహాదారులను వాడుకుంది’ | Sakshi
Sakshi News home page

‘రష్యా ట్రంప్‌ సలహాదారులను వాడుకుంది’

Published Sun, Apr 23 2017 11:15 AM

‘రష్యా ట్రంప్‌ సలహాదారులను వాడుకుంది’ - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికలను రష్యా ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమచారం. రష్యాలోని కొంతమంది ప్రభుత్వ అధికారులు అమెరికాలోని ట్రంప్‌ సలహాదారులను, ట్రంప్‌కు విదేశాంగ వ్యవహారాలకు సహాయపడే కార్టర్‌ పేజ్‌తోపాటు పలువురి ద్వారా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేందుకు గట్టిగానే ప్రయత్నించిందని స్పష్టమైనట్లు యూఎస్‌ అధికారులు చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఎఫ్‌బీఐ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఈ విషయం తెలిసిందట.

అయితే, పేజ్‌ను రష్యా పూర్తిస్థాయిలో వినియోగించుకుందా, పాక్షికంగానే అనే విషయం ఇంకా తెలియరాలేదని చెప్పారు. రష్యా విషయంలో అమెరికా విదేశాంగ విధానం చాలా కఠినంగా ఉంటుందని గత ఏడాది రష్యాలో ఓ యూనివర్సిటీలో పేజ్‌ ప్రసంగం చేసినప్పటి నుంచే ఎఫ్‌బీఐ అతడిపై ఓ కన్నేసి ఉంచిందట. అలా స్పీచ్‌ ఇచ్చిన ఆయన అమెరికా వచ్చినప్పటి నుంచి రష్యా ప్రభుత్వ అధికారులతో ప్రతిక్షణం టచ్‌లోనే ఉన్నట్లు కూడా సమాచారం. ట్రంప్‌ సలహాదారుల్లో పేజ్‌ కూడా కీలకమైన వ్యక్తి.

Advertisement
Advertisement