ప్రముఖ క్రీడాకారుడికి తృటిలో తప్పిన ప్రమాదం | Ronaldinho escapes unhurt from car accident | Sakshi
Sakshi News home page

ప్రముఖ క్రీడాకారుడికి తృటిలో తప్పిన ప్రమాదం

Oct 3 2015 10:37 AM | Updated on Jul 11 2019 7:49 PM

ప్రముఖ  క్రీడాకారుడికి తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

ప్రముఖ క్రీడాకారుడికి తృటిలో తప్పిన ప్రమాదం

బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డినో (35) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

రియోడి జనిరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డిన్హో (35) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తన తల్లి పోర్టో అలిగ్రే పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న  కారు  అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలో పడిపోయింది. అది పెద్ద ప్రమాదమేనని, అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదని.. ఇది చాలా గొప్పవిషయమని  రొనాల్డిన్హో ప్రతినిధి తెలిపారు. ప్రమాదం జరిగినపుడు అతడి వ్యక్తిగత డ్రైవరు కారు నడుపుతున్నట్టు  తెలుస్తోంది. ఈ  ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రొనాల్డిన్హో రెండుసార్లు అందుకున్నాడు బ్రెజిల్ స్టార్ ఆటగాడు రొనాల్డిన్హో. మెరుపు దాడులతో అనేకసార్లు జట్టుకు విజయాన్ని అందించిన ఘనత అతడి సొంతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement