చిన్న పాప గాలానికి భారీ చేప చిక్కింది!

చిన్న పాప గాలానికి భారీ చేప చిక్కింది!


న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ చిన్నారి రికార్డు నెలకొల్పింది. సరదాగా తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లిన ఎమ్మా జజ్డెల్(9) తన గాలానికి కోబియా రకానికి చెందిన ఓ భారీ చేప పడుతుందని ఊహించలేదు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మా తన తండ్రి రాబర్ట్, మరికొందరితో కలిసి చేపల వేటకు బోటులో బయలుదేరింది. అక్కడ కొన్ని జట్లుగా విడిపోయి ఎవరికి వారు తమ వద్ద ఉన్న సామాగ్రితో ఫిష్ హంటింగ్ చేశారు.



మేరీల్యాండ్ తూర్పు ప్రాంతంలో రోజూ చేపలుపట్టే ప్రాంతంలో బోటు నిలిపివేశారు. అందరికంటే ముందుగా ఎమ్మా తన వద్ద ఉన్న మేషిన్ తో ఓ చేపను పట్టింది. అయితే అది పెద్దచేప కావడంతో 20 నిమిషాలపాటు అలాగే ఉన్న తర్వాత ఆమె తండ్రి బోటును అక్కడికి తీసుకొచ్చి వారి వలను పైగి లాగాడు. అతడు తన సహాయకులతో కలిసి చివరికి ఆ చేపను బోటులోకి లాగి షాక్ తిన్నారు.



తన కూతురు తనకంటే పెద్ద చేపను పట్టడంతో ఆయన పట్టరాని ఆనందంలో ఉన్నాడు. చేప 66.5 ఇంచ్ పొడవు ఉండగా  చిన్నారి ఎమ్మా 52 ఇంచ్ ఉంది. ఆ చేప 94.6 పౌండ్ల బరువు తూగగా, ఎమ్మా బరువు 65 పౌండ్లు ఉండటంతో చిన్నారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుందని ఆమె తండ్రి చెబుతున్నాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదిస్తామని వివరించారు.


ఆస్ట్రేలియాలో 135 పౌండ్ల బరువున్న కోబియా చేప, వర్జీనియాలో 109 పౌండ్లున్న కోబియా చేపలు మాత్రమే ఇప్పటివరకూ వలలో చిక్కిన ఈ రకం బరువైన చేపలు. వీటి తర్వాత ఎమ్మా పట్టినదే బరువైన చేప. గిన్నిస్ బుక్ సంస్థ వారు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top