భారత సంతతి వ్యక్తికి కీలక పదవి | Raj Shah: Donald Trump appoints Indian-American to key White | Sakshi
Sakshi News home page

భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

Sep 14 2017 1:45 AM | Updated on Apr 4 2019 3:20 PM

భారత సంతతి వ్యక్తికి కీలక పదవి - Sakshi

భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలనావర్గంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలనావర్గంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది.  రాజ్‌ షా(32)ను అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, ప్రిన్సిపల్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా నియమిస్తున్నట్లు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచార డైరెక్టర్‌గా హోప్‌ హిక్స్‌ను నియమించినట్లు పేర్కొంది.  రిపబ్లికన్‌ నేషనల్‌ కమిటీలో పరిశోధన విభాగానికి నేతృత్వం వహించిన షా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీకి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement