మనిషి కన్నా జంతువే మిన్నా.. వైరల్‌ వీడియో | Police Dog Tries To Revive Trainer in Spain | Sakshi
Sakshi News home page

మనిషి కన్నా జంతువే మిన్నా.. వైరల్‌ వీడియో

Jun 26 2018 6:25 PM | Updated on Sep 29 2018 4:26 PM

Police Dog Tries To Revive Trainer in Spain - Sakshi

స్పేయిన్‌: మనిషి కన్నా జంతువే మిన్న అని నిరూపించిన సంఘటన ఒకటి స్పేయిన్‌లో చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన శిక్షకుడిని కాపాడేందుకు ఓ పోలీసు కుక్క నానా తిప్పలు పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ పోలీసు అధికారి కే-9 శిక్షకునిగా పనిచేస్తున్నారు. శిక్షణలో భాగంగా అధికారి సెల్యూట్‌ చేస్తూ ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలీపోయినట్టు నటించారు.

దీంతో తన దగ్గరలో ఉన్న ఆఫీసర్‌ పోంచో అనే పోలీసు కుక్క అధికారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. అధికారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఛాతిపై ఒత్తిడి పెంచేందుకు పైకి కిందకు దూకుతూ.. మద్యలో మద్యలో శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుసుకునేందుకు ఆతని ముఖంపై తల పెట్టి గమనించింది. కొంత సమయం తరువాత అధికారి లేచి కూర్చోవడంతో కుక్క ఆనందంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను మాడ్రిడ్‌ మున్సిపల్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన నాలుగు రోజులకే 20 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతో ఆ కుక్క సోషల్ మీడియాలో హీరో అయిపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement