సింగపూర్ ప్రధానికి మోదీ అరుదైన గిఫ్ట్‌ | PM's Gift to Prime Minister of Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్ ప్రధానికి మోదీ అరుదైన గిఫ్ట్‌

Nov 24 2015 9:28 PM | Updated on Sep 3 2017 12:57 PM

సింగపూర్ ప్రధానికి మోదీ అరుదైన గిఫ్ట్‌

సింగపూర్ ప్రధానికి మోదీ అరుదైన గిఫ్ట్‌

సింగపూర్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని హెచ్‌ఈ లీ సీన్ లూంగ్‌కు అరుదైన కానుకను అందించారు.

సింగపూర్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని హెచ్‌ఈ లీ సీన్ లూంగ్‌కు అరుదైన కానుకను అందించారు. 1849 నాటి సింగపూర్ దీవుల మ్యాప్‌ పునర్‌ముద్రణను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. 1842-45 మధ్యకాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన ఈ నక్షలో అప్పటి సింగపూర్ నగరం, దాని చుట్టపక్కల ప్రాంతాలు, దిగువప్రాంత జలాలను చిత్రించారు. భారత జాతీయ ఆర్కైవ్స్ సంస్థ నుంచి సేకరించిన రేఖాచిత్రాల ఆధారంగా ఆనాటి మ్యాపును 52X52 అంగుళాల వెడల్పులో మళ్లీ యాథాతథంగా పునర్‌ముద్రించి.. అరుదైన కానుకగా మోదీ, లీ సీన్ లూంగ్‌కు అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement