జీ 20 భేటీ : జపాన్‌ చేరుకున్న ప్రధాని

PM Modi Lands In Japans Osaka - Sakshi

టోక్యో : జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం జపాన్‌ చేరుకున్నారు. జీ 20 భేటీ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ సహా పలు దేశాధినేతలతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాని మోదీ బధవారం రాత్రి భారత్‌ నుంచి బయలుదేరి నేటి ఉదయం ఒసాకా చేరుకున్నారు. ‘ఉదయాన్నే ఒసాకా చేరుకున్నాం..జీ20 సదస్సుతో పాటు రానున్న రెండు రోజుల్లో ద్వైపాక్షిక, దౌత్య చర్చల కోసం వేచిచూస్తున్నా’మని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది.

కాగా, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన పలు అంశాలతో పాటు భారత్‌ దృక్కోణాన్ని ఈ చర్చల సందర్భంగా ప్రధాని అంతర్జాతీయ నేతల ముందు వెల్లడిస్తామని పీఎంఓ ట్వీట్‌ పేర్కొంది. జపాన్‌లో భారత సంతతికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారని పీఎంఓ తెలిపింది. ఈనెల 28-29న ఒసాకాలో జరిగే జీ20 భేటీ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఆరవ జీ20 సదస్సు కావడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top