హైవేపై కుప్పకూలిన విమానం

హైవేపై కుప్పకూలిన విమానం


ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ నుంచి క్వెరెటరోకు వెళుతోన్న ఎం7 ఎయిరోస్పేస్ ఎల్పీ అనే చిన్నతరహా విమానం ఒక్కసారిగా హైవేపై కుప్పకూలి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారని బుధవారం స్థానిక అధికారులు తెలిపారు.వేల అడుగుల ఎత్తులో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో  విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్ ప్రయత్నం చేశాడని, ఆ క్రమంలోనే విమానం అదుపు తప్పి నేలను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా పేలిపోయిందని స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారి గెరార్డో చెప్పారు. చనిపోయిరవారి వివరాలు ఇంకా తెలియాల్సిఉందన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top