ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసిన పాక్‌! | Pakistan's Babar-3 cruise missile launch fake, say some Indian experts | Sakshi
Sakshi News home page

ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసిన పాక్‌!

Jan 10 2017 4:43 PM | Updated on Sep 5 2017 12:55 AM

ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసిన పాక్‌!

ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసిన పాక్‌!

పాకిస్థాన్‌ ఒక్క భారత్‌నే కాదు మొత్తం ప్రపంచాన్నే మోసం చేసిందా? అసలు ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే అది చేసినట్లు అందులో విజయం సాధించినట్లు డంబాలు పలికి అందర్నీ బోల్తా కొట్టించిందా?

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ ఒక్క భారత్‌నే కాదు మొత్తం ప్రపంచాన్నే మోసం చేసిందా? అసలు ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే అది చేసినట్లు అందులో విజయం సాధించినట్లు డంబాలు పలికి అందర్నీ బోల్తా కొట్టించిందా? అంటే అవుననే భారత్‌కు చెందిన నిపుణులు అంటున్నారు. అవును.. పాకిస్థాన్‌ అసలు ఏ క్షిపణిని ఈ రెండు రోజుల్లో ప్రయోగించలేదంట.
చదవండి..(యుద్ధ క్షిపణిని పరీక్షించిన పాక్‌)

అది బాబర్‌ 3 అనే క్షిపణిని తొలిసారి జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు అది విజయం సాధించినట్లు పాక్‌ మీడియా చెప్పిన విషయం తెలిసిందే. అయితే, భారత్‌కు చెందిన రక్షణశాఖ, ఉపగ్రహ పరీశీలన విశ్లేషకులు మాత్రం పాక్‌ చెప్పేదంత బూటకం అని కొట్టి పారేస్తున్నారు. దీనికి సంబంధించి రాజ్‌ అనే ప్రముఖ విశ్లేషకులు పాక్‌ ప్రపంచాన్ని ఎలా మోసం చేసింది ఉదాహరణతో వివరించారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ద్వారా బాబర్‌ 3ని ప్రయోగించినట్లు వీడియో రూపొందించి అందరినీ బోల్తా కొట్టించిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement