
వాషింగ్టన్ : పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గమని మరోసారి అమెరికా పేర్కొంది. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్‌నుంచి పారిపోయిన తాలిబన్లు.. పాకిస్తాన్‌లో క్షేమంగా ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్‌లోని సంకీర్ణ బలగాల సైన్యాధికారి జనరల్ జాన్ నికోల్సన్ స్పష్టం చేశారు. తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో కావలసినంత డ్రగ్స్, డబ్బూ లభిస్తోందని ఆయన చెప్పారు. తాలిబన్ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో క్షేమంగా తలదాచుకున్నారని ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌నుంచి తాలిబన్లను ఏరేయడానికి అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం సరైందేనని చెప్పారు. అయితే తాలిబన్లకు పాకిస్తానే ఆశ్రయం కల్పించడంతో.. పోరాటం కొనసాగించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ట్రంప్ న్యూ ఆఫ్ఘన్ పాలసీకి పాకిస్తాన్ అనుకూలమని ప్రకటించినా.. ఇప్పటివరకూ అమలు చేయలేదని ఆయన ప్రకటించారు.