కూలిన పాక్‌ విమానం

Pak Air Force Plane Crashes In Islamabad - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ రిపబ్లిక్‌ డే పరేడ్‌ కోసం రిహార్సల్‌ చేస్తున్న ఎయిర్‌ఫోర్స్‌ ఎఫ్‌-16 యుద్ధవిమానం బుధవారం ఇస్లామాబాద్‌లో కుప్పకూలిందని ఎయిర్‌ఫోర్స్‌ ప్రతినిధి వెల్లడించారు. మార్చి 23న జరిగే పరేడ్‌, ఎయిర్‌ షో కోసం అమెరికన్‌ తయారీ ఎఫ్‌-16 విమానం రిహార్సల్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ ప్రతినిధి తెలిపారు. విమానం కుప్పకూలడంతో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహాయ సిబ్బంది వెళ్లాయని, ప్రమాద కారణాన్ని గుర్తించేందుకు విచారణకు ఆదేశించామని తెలిపింది.

చదవండి :పాక్‌ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top