బరువు తగ్గింది.. హాయిగా ఎగిరిపోయింది

Owl Became Too Fat To Fly In London Became Viral  - Sakshi

లండన్‌ : మనుషులు అధిక బరువుతో బాధపడుతూ డాక్టర్‌ దగ్గరికి వెళితే కచ్చితమైన డైట్‌ పాటిస్తే బరువు తగ్గుతారంటూ చెప్పడం సహజంగా వింటుంటాం. అచ్చం అలాగే ఒక గుడ్లగూబ అధిక బరువుతో ఎగరలేక ఇబ్బంది పడుతుండడంతో దానిని పూర్వపు స్థితికి తీసుకువచ్చారు బ్రిటన్‌కు చెందిన కొందరు పక్షి సంరక్షణ అధికారులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం అక్షరాల నిజం. ఇంకెందుకు ఆలస్యం వార్త మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది.

బ్రిటన్‌కు చెందిన సఫోల్క్ వోల్‌ సాంచురి అధికారులు కొన్ని వారాల క్రితం అభయారణ్యంలో సంచరిస్తుండగా ఒక గుడ్లగూబ ఎగరలేక అవస్థలు పడుతోంది. దానిని పరిశీలించి చూడగా 245 గ్రాముల బరువు ఉన్నట్లు తేలింది. మిగతావాటి కంటే మూడు రెట్లు అధికంగా ఉండడంతో ఎగరడానికి ఇబ్బంది పడుతుందని గుర్తించారు. ఇంకేముంది బరువు తగ్గించాలని భావించిన అధికారులు గుడ్లగూబకు కేజ్‌ ఏర్పాటు చేసి కొన్ని వారాల పాటు డైటింగ్‌ చేయించి దాని బరువు తగ్గించి మళ్లీ అభయారణ్యంలో వదిలేశారు. అయితే ఇదంతా వారు తమ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసుకున్నారు.'కొన్ని వారాల కింద మాకు గుడ్లగూబ దొరికినప్పుడు ఎగరడానికి చాలా ఇబ్బంది పడింది. అయితే దెబ్బ తగలడంతో ఎగరలేకపోతుందేమోనని భావించాం. కానీ దాని బరువు మిగతావాటి కంటే అధికంగా ఉండడంతోనే ఎగరలేకపోతుందని గుర్తించాం. కొన్ని వారాల పాటు దానిని మా సంరక్షణ కేంద్రంలో ఉంచి డైటింగ్‌ చేయించడంతో బరువు తగ్గి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఈరోజు దానిని కేజ్‌ నుంచి విడుదల చేయగానే ఒక్కసారిగా మాకు దొరకకుండా ఎగిరిపోయింది' అంటూ పోస్ట్‌ పెట్టారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top