మలేషియాలో ఒడిశా నవదంపతులు..

Odisha Couple Detained In Malaysia - Sakshi

భువనేశ్వర్‌ : కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో ఒడిశాకు చెందిన నవదంపతులు మలేషియాలో చిక్కుకున్నారు. వైరస్‌ కారణంగా ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలు రద్దు చేయడంతో వారికి ఈ దుస్థితి ఎదురైంది. అయితే ఈ నెల 17వ తేదీ నుంచి వారు మలేషియా విమానాశ్రయంలోనే ఉండిపోవడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి.. నవరంగపూర్‌కు చెందిన శంకర హల్‌దార్‌(28), పల్లవి మిశ్రా(27)లకు ఫిబ్రవరి 27వ తేదీన వివాహం జరిగింది. హనీమూన్‌ నిమిత్తం మలేషియాకు బయలుదేరిన ఆ జంట తిరిగి ఇంటికి వస్తుండగా ఈ నెల 17వ తేదీన మలేషియా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది వారిని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వారు ఇంటికి రాలేకపోయారు. ఈ క్రమంలో వారంతా తమ అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ మలేషియా విమానాశ్రయంలో కేవలం ఈ నూతన దంపతులే కాకుండా మరో 200 మంది భారతీయులు చిక్కుకున్నట్లు సమాచారం. (ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. కరోనాకు విరుగుడు..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top