జైలుకు పంపడానికి ట్రక్కును తెప్పించారు.. | Obese ISIS Preacher Who Endorsed Rape Ethnic Cleansing Carried To Prison In Truck | Sakshi
Sakshi News home page

ఆయన స్ధావరం బేకరీనా..!

Jan 17 2020 4:20 PM | Updated on Jan 17 2020 7:44 PM

Obese ISIS Preacher Who Endorsed Rape Ethnic Cleansing Carried To Prison In Truck - Sakshi

ఇరాక్‌లో పట్టుబడ్డ ఐఎస్‌ నేతను తరలించేందుకు ఏకంగా ట్రక్కును రప్పించడం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లోని మొసుల్‌లో పట్టుబడిన ఐసిస్‌ నేత, ప్రభోదకుడు, భారీకాయుడైన షిఫాల్‌ నిమను జైలుకు తరలించేందుకు అధికారులు ముప్పతిప్పలు పడ్డారు. 130 కిలోలకు పైగా బరువున్న షిఫల్‌ను కారులో ఎక్కించలేక ఆయన కోసం ప్రత్యేకంగా ట్రక్కును తెప్పించారు. ఐఎస్‌ నేత స్ధావరం బేకరీ అయి ఉంటుందని ఆయన ఆకారాన్ని చూసిన నెటిజన్లు జోక్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐసిస్‌ ప్రముఖ నేతగా పేరొందిన షిఫల్‌ నిమ జారీ చేసిన ఫత్వాలు మేథావులు, ఆథ్యాత్మిక వేత్తల హత్యలకు దారితీశాయని ఇరాక్‌ పోలీసులు పేర్కొన్నారు. నిమ పట్టుబడటం ఐసిస్‌కు మానసికంగా కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. కాగా. 2013లో పురుడు పోసుకున్న ఐసిస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా) ఉగ్రవాద గ్రూపు తమ అధినేత అబు బకర్‌ అల్‌ బాగ్ధాది హతమైనా ప్రపంచానికి పెనుముప్పుగానే పరిణమించింది.

చదవండి : రాజధానిలో కలకలం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement