యూట్యూబ్‌లో ఇక త్రీడీ వీడియోలు | now, 3d videos in youtube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో ఇక త్రీడీ వీడియోలు

Jul 25 2015 5:28 PM | Updated on Sep 3 2017 6:09 AM

యూట్యూబ్‌లో ఇక త్రీడీ వీడియోలు

యూట్యూబ్‌లో ఇక త్రీడీ వీడియోలు

యూట్యూబ్‌లో త్రీడీ వీడియోలను, 360 డిగ్రీల కోణంలో వర్చువల్ దృశ్యాలను వీక్షించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.

యూట్యూబ్‌లో త్రీడీ వీడియోలను, 360 డిగ్రీల కోణంలో వర్చువల్ దృశ్యాలను వీక్షించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని యూట్యూబ్ సీఈవో సుసాన్ వోజ్‌సికీ కాలిఫోర్నియాలో జరిగిన ఆరో వార్షిక విడ్కాన్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఇప్పటికే త్రీడీ యాడ్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని, త్వరలో అన్ని త్రీడీ, 360 కోణంలో వీడియోలను, దృశ్యాలను ఎవరికి వారు అప్‌లోడ్ చేసుకునేలా ఆధునీకరించిన అప్లికేషన్‌ను విడుదల చేస్తున్నామని చెప్పారు.

కంప్యూటర్ స్క్రీన్లపై మౌస్ను కదిలించడం ద్వారా మనకు కావాల్సిన యాంగిల్స్‌లో వీడియో దృశ్యాలను కదిలించే అవకాశం ఈ యాప్ ద్వారా సమకూరుతుందని సుసాన్ తెలిపారు. సెల్‌ఫోన్‌లోనైతే ఫోన్‌ను కదలించడం ద్వారా యాంగిల్స్‌ను మార్చుకోవచ్చని చెప్పారు. ఈ కొత్త యాప్‌లో వీడియో, ఫొటో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయని, వాటి ద్వారా త్రీడీ, 360 వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చని వివరించారు. ఆండ్రాయిడ్, మొబైల్ వెర్షన్లలో ఈ కొత్త యాప్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement