ఉభయకొరియాల శిఖరాగ్రానికి తేదీ ఖరారు | North, South Korea fix April date for first summit in years | Sakshi
Sakshi News home page

ఉభయకొరియాల శిఖరాగ్రానికి తేదీ ఖరారు

Mar 30 2018 3:38 AM | Updated on Apr 4 2019 5:22 PM

North, South Korea fix April date for first summit in years - Sakshi

సియోల్‌: ఉభయకొరియాల శిఖరాగ్ర సమావేశానికి తేదీ ఖరారైంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనా రహస్య పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే పాన్‌మున్‌జోన్‌లో జరిగిన ఇరు దేశాల ఉన్నతాధికారుల భేటీలో ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. సరిహద్దుల్లో ఉన్న పాన్‌మున్‌జోన్‌లో ఏప్రిల్‌ 27వ తేదీన ‘2018 దక్షిణ–ఉత్తర సమావేశం’ జరిపేందుకు తమ నేతలు అంగీకరించారని రెండు దేశాల అధికారులు గురువారం ఉమ్మడి ప్రకటన వెలువరించారు. ఈ సమావేశంతో కొరియా యుద్ధం తర్వాత ఉత్తరకొరియా నేత ఒకరు దక్షిణ కొరియాలో అడుగుపెట్టనుండటం ఇదే ప్రథమం కానుంది. దీని తర్వాత మేలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చారిత్రక సమావేశం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement