అమెరికా సమక్షంలో వాటిని ఆపేస్తాం: కిమ్‌ | North Korea To Dismantle Its Nuclear Program In May | Sakshi
Sakshi News home page

అమెరికా సమక్షంలో వాటిని ఆపేస్తాం: ఉత్తర కొరియా

Apr 29 2018 4:34 PM | Updated on Apr 29 2018 7:40 PM

North Korea To Dismantle Its Nuclear Program In May - Sakshi

ప్యాంగ్యాంగ్‌ (దక్షిణ కొరియా) : ఉత్తరం, దక్షిణం కలిసిపోయాయి. అదేనండి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య గత శుక్రవారం చారిత్రక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సంచలనమైన, ప్రపంచ దేశాలు ఉపిరి పిల్చుకునే నిర్ణయం తీసుకున్నట్టు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ ఇన్‌ తెలిపారు. భారీ అణ్వాయుధాలకు అడ్డాగా మారిన ఉత్తర కొరియా తన న్యూక్లియర్‌ పరీక్షలను, తయారీని వచ్చే నెల మే లో నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

అంతే కాకుండా అగ్రరాజ్యం అమెరికా ఆయుధ నిపుణులను ఆహ్వానించి వారి సమక్షంలోనే దానిని డిస్‌మాంటిల్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ముందు పారద్శకంగా ఉండేందుకు అమెరికా, దక్షిణ కొరియా ఆయుధ నిపుణుల ముందు ఈ న్యూక్లియర్‌ ప్లాంట్‌ను డిస్‌మాంటిల్‌ చేయనున్నారు. ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడికి, జపాన్‌ అధ్యక్షుడు షిన్‌జో అబెకి ఫోన్‌ చేసి, అంతా సవ్యంగానే జరుగుతుందని అన్నారు. ఉత్తర కొరియా నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement