రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

Nobel prize in chemistry Given to Development of Lithium-ion batteries - Sakshi

రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్‌ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ గత రెండురోజుల్లో వైద్య, భౌతికశాస్త్రాల్లో నోబెల్‌ విజేతలను ప్రకటించిన పురస్కార కమిటీ.. తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్‌ బి.గూడెనఫ్‌, స్టాన్లీ విట్టింగమ్‌, అకిరా యోషినోకు ఈ అవార్డ్‌ను సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. లిథియం ఆయాన్‌ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకు వారికి ఈ పురస్కారం లభించింది. వీరు అభివృద్ధి చేసిన లిథియం ఆయాన్‌ బ్యాటరీలు పోర్టబుల్‌ టెక్నాలజీ విప్లవానికి కారణమయ్యాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top