'కరోనా నివారణకు ప్రత్యేక వ్యాక్సిన్‌ను కనుగొన్నాం'

Nigerian Scientists Claim To Have Discovered COVID-19 Vaccine - Sakshi

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. నైజీరియా దేశానికి చెందిన శాస్త్రవేత్తల బృందం కరోనా సంక్రమణను నివారించే ఓ ప్రత్యేకమైన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోవిడ్‌-19 రీసెర్చ్‌ గ్రూప్‌ అధ్వర్యంలోని నైజీరియా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అడెలెకే విశ్వవిద్యాలయంలోని మెడికల్‌ వైరాలజీ, ఇమ్యునాలజీ నిపుణుడు, కోవిడ్‌-19 పరిశోధనా బృందం నాయకుడు డాక్టర్‌ ఒలాడిపో కోలవోల్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ఆఫ్రికన్ల కోసం ఆఫ్రికాలో స్థానికంగా ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయబడుతుంది. ఈ వ్యాక్సిన్‌ అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకొని అందుబాటులోకి రావడానికి కనీసం 18 నెలల సమయం పడుతుంది. ఈ పరిశోధనకు గానూ ట్రినిటీ ఇమ్యునో డెఫిషియంట్‌ లాబోరేటరీ, హెలిక్స్‌ బయోజెన్‌ కన్సల్ట్‌, ఓగ్బో మోషోల నుంచి 7.8 మిలియన్‌ నైజీరియన్‌ నైరాస్‌ నిధులు అందాయని' ఆయన పేర్కొన్నారు. చదవండి: కోవిడ్‌కు హైదరాబాద్‌ ఇంజెక్షన్‌ రెడీ

మరో ప్రొఫెసర్‌ జూలియస్‌ ఒలోక్‌ మాట్లాడుతూ.. 'వ్యాక్సిన్‌ విజయవంతమైంది. కాకపోతే ఇది ఆఫ్రికన్లను లక్ష్యంగా చేసుకొని తయారు చేశాము. ఇతర జాతుల మీద కూడా పనిచేస్తుందని భావిస్తున్నాము. ఈ వ్యాక్సిన్‌ మా సంకల్పం యొక్క ఫలితం. దీని తయారీకి అనేక శాస్త్రీయ ప్రయత్నాలు అవసరమయ్యాయి. వ్యాక్సిన్లు అవసరమయ్యే జనాభా ప్రస్తుతం మందులు అవసరం కంటే ఎక్కువ  ఉంది. కనుక టీకాపై మరింత దృష్టి సారించాము' అని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) ప్రకారం.. 120 వ్యాక్సిన్‌ ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా.. 13 మాత్రం మనుషులపై ప్రయోగ దశలో ఉన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top