న్యూయార్క్ నుంచి లండన్ కు 3 గంటల్లోనే | new york to london within 3 hours | Sakshi
Sakshi News home page

న్యూయార్క్ నుంచి లండన్ కు 3 గంటల్లోనే

Jul 13 2015 6:35 AM | Updated on Oct 17 2018 4:36 PM

న్యూయార్క్ నుంచి లండన్ కు 3 గంటల్లోనే - Sakshi

న్యూయార్క్ నుంచి లండన్ కు 3 గంటల్లోనే

గంటకు 2,205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ లగ్జరీ విమానాన్ని బోస్టన్‌కు చెందిన సైయిక్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసింది.

బోస్టన్: గంటకు 2,205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ లగ్జరీ విమానాన్ని బోస్టన్‌కు చెందిన సైయిక్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసింది. న్యూయార్క్ నుంచి లండ న్‌కు సాధారణంగా 8 గంటలు పడుతుందనీ, ఇందులో  కేవలం 3 గంటల వ్యవధిలో చేరుకోవచ్చని వెల్లడించింది. ‘ఎస్-512’ జె ట్‌ను 2013లో రూపకల్పన చేశారు. ఇందులో మార్పులు చేసి విమానం బరువు తగ్గించి, వేగాన్ని పెంచాలని సంస్థ ఇంజినీర్లు నిర్ణయించారు. ఈ బృందంలో భారతీయ సంతతి ఇంజినీర్ అనుతోష్ మొయిత్రా కూడా ఉన్నారు.

వీటికి నూతన సాంకేతికతతో తయారు చేసిన డెల్డా రెక్కలు ఏర్పాటు చేశామని అనుతోష్ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన తోక కారణంగా విమానం బరువు తగ్గిందనీ, ఇంధన ఆదా పెరిగిందని తెలిపారు. తక్కువ ఎత్తులో కూడా వేగంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. దీని తయారీకి 60-80 మిలియన్ డాలర్లు ఖర్చు చేశామని తెలిపారు. ఎస్-512 భావితర విమానాలకు తొలిమెట్టు అని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి విక్ కచోరియా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement