ఇండియన్‌ ఎంబసీ వద్ద అనుమానిత వస్తువుల కలకలం

Mystery Packages At Indian Consulates In Australia Trigger Evacuation - Sakshi

మరో 12 ఎంబసీల వద్ద అదే కూడా అదే పరిస్థితి

సాక్షి, న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని భారత ఎంబసీ వద్ద బుధవారం ఉదయం అనుమానిత వస్తువులు కనబడడంతో కలకలం రేగింది. వాటిని పేలుడు పదార్థాలుగా భావిస్తున్నారు. బాంబు నిర్వీర్య దళం, ఫైర్‌ ఇంజన్లు, ఎమర్జెన్సీ వాహనాలు ఎంబసీ వద్దకు చేరుకున్నాయి. సిబ్బందిని కార్యాలయం నుంచి ఖాళీ చేయించారు.

ఇండియాతో పాటు పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, గ్రీస్‌, స్పెయిన్‌, సెచెల్లెస్‌, స్విట్జర్లాండ్‌,  క్రోయేషియా, ఈజిప్టు, యూకే, యూఎస్‌ఏ ఎంబసీల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఓ స్థానిక చానెల్‌ పేర్కొంది. అక్కడ కూడా అనుమానిత ప్యాకేజీలు బయటపడడంతో భయాందోళనలు మొదయ్యాయని వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top