‘నా కొడుకు ఉగ్రవాది కాదు’ | 'My son was no terrorist': father of French airport attacker | Sakshi
Sakshi News home page

‘నా కొడుకు ఉగ్రవాది కాదు’

Mar 19 2017 4:24 PM | Updated on Aug 29 2018 8:38 PM

‘నా కొడుకు ఉగ్రవాది కాదు’ - Sakshi

‘నా కొడుకు ఉగ్రవాది కాదు’

తన కుమారుడు ఉగ్రవాది కాదని ప్యారిస్‌లోని ఓర్లి విమానాశ్రయంలో సైనికుల చేతుల్లో ప్రాణాలుకోల్పోయిన అగంతకుడి తండ్రి చెప్పాడు.

ప్యారిస్‌: తన కుమారుడు ఉగ్రవాది కాదని ప్యారిస్‌లోని ఓర్లి విమానాశ్రయంలో సైనికుల చేతుల్లో ప్రాణాలుకోల్పోయిన అగంతకుడి తండ్రి చెప్పాడు. మద్యం సేవించడం, మత్తుపదార్థాలు తీసుకోవడం వల్ల అతడి చర్యలు అలాంటి ఆందోళన కలిగిస్తాయని చెప్పారు. ‘నా కొడుకు ఉగ్రవాది కాదు. అతడు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. బాగా తాగుతాడు. ఆ కారణం వల్లే అతడి చర్యలు విపరీతంగా అనిపిస్తాయి’  అని జియాద్‌ బెన్‌ బెల్గాసెమ్‌ తండ్రి ఫ్రాన్స్‌కు చెందిన యూరప్‌ 1 రేడియోకు వివరాలు అందించాడు.

ఓర్లి విమానాశ్రయంలో గస్తీ నిర్వహిస్తున్న ఓ సైనికురాలి వద్ద తుపాకీ లాక్కునేందుకు జియాద్‌ ప్రయత్నించి ప్రకంపనలు సృష్టించాడు. అతడి చర్యతో అవాక్కయిన బలగాలు వెంటనే అతడిని ఉగ్రవాదిగా భావించి కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, అంతకంటే ముందు అతడు అల్లా కోసం చనిపోతానని, వేరే వాళ్లను చంపేస్తానని బెదిరించినట్లు కాల్పులు జరిపిన సైనికులు చెబుతున్నారు.

సంబంధిత మరిన్ని వార్తా కథనాలకై చదవండి

ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement