కూచిభొట్ల భార్యకు తాత్కాలిక వర్క్‌ వీసా | Murdered Indian techie’s widow gets temporary work visa in US | Sakshi
Sakshi News home page

కూచిభొట్ల భార్యకు తాత్కాలిక వర్క్‌ వీసా

Sep 15 2017 2:11 AM | Updated on Apr 4 2019 3:21 PM

కూచిభొట్ల భార్యకు తాత్కాలిక వర్క్‌ వీసా - Sakshi

కూచిభొట్ల భార్యకు తాత్కాలిక వర్క్‌ వీసా

అమెరికాలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల భార్య సునయన దుమలా అమెరికా నివాస హక్కులపై సందిగ్ధతలు తొలగిపోయాయి.

వాషింగ్టన్‌: అమెరికాలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల భార్య సునయన దుమలా అమెరికా నివాస హక్కులపై సందిగ్ధతలు తొలగిపోయాయి. కాంగ్రెస్‌ సభ్యుడు కెవిన్‌ యోడర్‌ సహాయంతో ఇటీవల ఆమె అమెరికా తాత్కాలిక వర్క్‌ వీసా పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్‌ బార్‌లో శ్రీనివాస్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే.  భర్త శ్రీనివాస్‌ మరణించడంతో అమెరికాలో నివసించే హక్కును సునయన కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక వీసా పొందేందుకు యోడర్‌ సహాయం చేశారు. ‘సునయన బాధపడింది చాలు. ఆమెకు సహాయపడాలని భావించాము. ఇకపై శాశ్వత వీసా వచ్చేలా ప్రయత్నిస్తాం’ అని యోడర్‌ ఫేస్‌బుక్‌లో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement