మారిషస్ ఒక మినీ భారత్ - మోదీ | Modi visits Ganga Talao in Mauritius, prays at temple | Sakshi
Sakshi News home page

మారిషస్ ఒక మినీ భారత్ - మోదీ

Mar 12 2015 1:58 PM | Updated on Aug 15 2018 6:32 PM

భారత ప్రధాని నరేంద్రమోదీ మారిషస్ లోని హిందువుల పవిత్రస్థలమైన గంగా తలావ్ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

పోర్ట్ లూయీస్: భారత ప్రధాని నరేంద్రమోదీ  మారిషస్ లోని హిందువుల పవిత్రస్థలమైన గంగా తలావ్ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక  ప్రార్థనలు చేశారు. మార్చి 12 మారిషస్  జాతీయ దినోత్సం సందర్భంగా మోదీ  జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరం వరల్డ్ హిందీ సెక్రటేరియట్ భవనానికి శంకుస్థాపన చేశారు.   ఈ సందర్భంగా హిందీ భాషను ఆదరిస్తున్న మారిషస్ ప్రజలను అభినందించారు మోదీ.  మారిషస్  ఒక మినీ భారత్ అని  తన బిడ్డకు భారత మాత ప్రణామాలర్పిస్తోందన్నారు.  ఇక్కడున్న  కోట్లాది భారతీయుల కోరిక మేరకు   మారిషస్ వచ్చానన్నారు మోదీ.

 

 

Advertisement
 
Advertisement
Advertisement