మిస్‌ ఇండియా దక్షిణాఫ్రికా శ్రీశుభ | miss india southafrica adepally srishuba | Sakshi
Sakshi News home page

మిస్‌ ఇండియా దక్షిణాఫ్రికా శ్రీశుభ

Sep 5 2017 2:22 AM | Updated on Sep 17 2017 6:23 PM

మిస్‌ ఇండియా దక్షిణాఫ్రికా శ్రీశుభ

మిస్‌ ఇండియా దక్షిణాఫ్రికా శ్రీశుభ

మిస్‌ ఇండియా దక్షిణా ఫ్రికా గాటెంగ్‌– 2017’ అందాల పోటీ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడ్డేపల్లి శ్రీశుభ విజేతగా నిలిచింది.

జోహన్నస్‌బర్గ్‌: ‘మిస్‌ ఇండియా దక్షిణా ఫ్రికా గాటెంగ్‌– 2017’ అందాల పోటీ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడ్డేపల్లి శ్రీశుభ విజేతగా నిలిచింది. భారతీయ సంతతి యువతి ఈ పోటీలో నెగ్గడం ఇది రెండోసారి. 25ఏళ్ల శ్రీశుభ ప్రస్తుతం జోహన్నస్‌బర్గ్‌లో ఓ ప్రముఖ బ్యాంకులో 18నెలల నుంచి ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. అందాల పోటీలో తుదిపోరు సందర్భంగా ఓ పాటకు ఈమె చేసిన నృత్యం జ్యూరీ సభ్యులను మంత్రముగ్ధుల్ని చేసింది.

‘నృత్యమంటే నాకు ప్రాణం. పోటీలో నాకు 3 నిమిషాలే సమయమిచ్చారు. ఆప్యాయత అనురాగాలకు నెలవైన కుటుంబంలో పెరిగాను. నా తండ్రిని కోల్పోయాను. ఇలా నా జీవితంలోని వేర్వేరు పార్శా్వలను మూడు నిమిషాల్లో మూడు సెగ్మెంట్లలో చూపించాను. స్నేహితులతో ఛాలెంజ్‌ చేసి మరీ ఈ పోటీలో నెగ్గాను. దక్షిణాఫ్రికాలోని మరో ఎనిమిది ప్రావిన్సుల విజేతలతో త్వరలో పోటీపడతా’ అని శ్రీశుభ చెప్పారు. ఈ పోటీల్లో విజేతగా నిలిస్తే దక్షిణాఫ్రికా తరఫున ‘ఇంటర్నేషనల్‌ మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌’ పోటీలో ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement