అసభ్య సంజ్ఞల యుద్ధం

Middle Finger Fight Between Two Guys Goes Crazily Viral - Sakshi

ఈ వేలు మా నాన్నలోని పవర్‌.. ఈ వేలు నా మీసంలోని పవర్‌ అంటూ హరికృష్ణ పవర్‌ఫుల్‌గా చెప్పిన డైలాగ్‌ చూశాం. కానీ వేళ్లతోనే యుద్ధం చేసుకున్న ఇద్దరు వ్యక్తులను మరో వ్యక్తి వీడియో తీసి పెట్టడంతో వైరల్‌ అయింది. 

న్యూయార్క్‌లోని ఎన్‌వైసీ వీధిలో ఇద్దరు వ్యక్తులు ఎందుకో గొడవకు దిగారు. అటుగా వెళుతున్న గయ్‌ బుల్లెచ్‌ వీరి గొడవను వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ గొడవలో పంచ్‌లు, ముష్టిఘాతాలు ఉన్నాయేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆ ఇద్దరు ఒకరికొకరు అసభ్యకరమైన సంజ్ఞను (మధ్య వేలును) చూపించుకుంటూ రెచ్చిపోయారు. వారిలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా సమస్య ఎదురైనా వేలును చూపించడం మాత్రం ఆపలేదు. ఈ చర్య పలువురిని నవ్వించడంతో వైరల్‌ అయింది.

ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఇది ఫేక్‌ వీడియో అని ఒకరు, జీవితం అంత సాఫీగా సాగదు అనడానికి ఇది నిదర్శనమని మరొకరు కామెంట్‌ చేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top