కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు

Mayday Mayday  Terrifying Last Moments In PIA Cockpit On Flight Audio - Sakshi

"మేడే, మేడే, మేడే" అంతర్జాతీయ ప్రమాద సంకేతాన్నిచ్చిన పైలట్

కరాచీలో దిగడానికి ప్రయత్నిస్తూ కుప్పకూలిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఆఖరి నిమిషంలో చోటు చేసుకున్న కాక్‌పిట్ సంభాషణల వివరాలు వెలుగులోకి వచ్చాయి.  విమానం పైలట్లలో ఒకరు,  ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మధ్య జరిగిన సంభాషణ  వివరాలు ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్‌రాకపోకలను గమనించే ప్రసిద్ధ వెబ్‌సైట్ లైవ్‌ఏటీసీ.నెట్‌ పోస్ట్ చేసిన ఆడియో క్లిప్‌లో ఆఖరి నిమిషంలో పైలట్‌  రెండు ఇంజిన్లు చెడిపోయాయంటూ ఆందోళన చెందారు. తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నామనేందుకు సంకేతంగా "మేడే, మేడే, మేడే"  అనే సందేశాన్నిచ్చారు. రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయే కొన్ని క్షణాల ముందు ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా ఇబ్బంది ఏర్పడిందని పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన ఏటీసీ రెండు రన్ వేలు సిద్దంగా ఉన్నాయని చెప్పినా, పైలట్ (ఎ) గో-రౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాడని, ఇది చాలా విషాదకరమైన సంఘటన అని పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్. ఖాన్ తెలిపారు.

సంభాషణ ఇలా  ఉంది
పీకే8303 పైలట్: అప్రోచ్
ఏటీసీ:  జీ సర్
పైలట్: మేం ఎడమవైపు తిరగాలా?
ఏటీసీ: ఒకే (ధృవీకరణ)
పైలట్:  మేం డైరెక్టుగా వెళుతున్నాం. రెండు ఇంజన్లను కోల్పోయాము.
ఏటీసీ: మీరు బెల్లీ ల్యాండింగ్  (గేర్-అప్ ల్యాండింగ్) చేస్తున్నారని నిర్ధారించండి?
పైలట్:  వినిపించడంలేదు. 
ఏటీసీ:  ల్యాండింగ్  కోసం 2- 5 రన్‌వే అందుబాటులో ఉంది
పైలట్: రోజర్
పైలట్: సర్, మేడే, మేడే, మేడే, పాకిస్తాన్ 8303
ఏటీసీ: పాకిస్తాన్ 8303, రోజర్ సర్. రెండు రన్‌వేలు అందుబాటులో ఉన్నాయి.
అంతే ఇక్కడితో  ఆడియో కట్ అయిపోయింది.

కొద్దిసేపటి తరువాత, విమానాశ్రయానికి సమీపంలోని జనావాసప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తప్పా మిగిలిన అందరూ చనిపోయి వుంటారని భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అందించిన సమాచారం ప్రకారం ముందు టవర్ ను ఢీకొట్టిన విమానం, తరువాత జనావాసాలపై కూలిపోయింది.

 చదవండి : ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top