
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఏడాది పాటు కొనసాగనున్న 73వ సెషన్‌కు ఆమె నేతృత్వం వహిస్తారు. ఏడు దశాబ్దాల ఐరాస చరిత్రలో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగో మహిళ మరియా కావడం గమనార్హం.
1953లో భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ సాధారణ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 1969లో లైబీరియాకు చెందిన ఎలిజబెత్ బ్రూక్స్, 2006లో బహ్రెయిన్‌కు చెందిన షేకా హయా రషెద్ అల్ ఖలీఫాలు అధ్యక్షులుగా పనిచేశారు. ఐరాసలో 198 సభ్య దేశాలుండగా.. మంగళవారం రహస్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికలో మరియాకు 128 ఓట్లు దక్కగా.. ఫ్లేక్‌కు 62 ఓట్లు పడ్డాయి.