నవచైనా నిర్మాత మావోజెడాంగ్ కూడా తప్పులు చేశాడని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వ్యాఖ్యానించాడు.
బీజింగ్: నవచైనా నిర్మాత మావోజెడాంగ్ కూడా తప్పులు చేశాడని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వ్యాఖ్యానించాడు. అయితే దేశరూపరేఖలను మార్చిన విప్లవాత్మక నేతను ప్రజలు సరైన చారిత్రక దృక్పథంతో చూసి అర్థం చేసుకోవాలని కోరారు. గురువారం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా సమావేశంలో దేశ అధ్యక్షుడు, సీపీసీ జనరల్ సెక్రటరీ జి జిన్‌పింగ్ మాట్లాడుతూ దేశ రూపురేఖలను మార్చిన గొప్పవ్యక్తి మావో అని కొనియాడారు. మావో 120వ జయంతిని చైనా ఘనంగా నిర్వహించనున్నటు తెలిపారు. అంతకుముందు ఆయన బీజింగ్‌లో మావో సమాధిని సందర్శించి నివాళులర్పించారు.