breaking news
wrongs
-
భాష ముఖ్యం బిగిలూ!
తమిళనాడులో భాషా రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. మంత్రి తమిళ ఉచ్చారణ, వ్యాకరణంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగా.. బీజేపీ కూడా రంగంలోకి దిగి తమిళ భాషను గౌరవించాలని డిమాండ్ చేసింది. దీంతో ‘భాషా ప్రేమ’ వర్సెస్ ‘వ్యక్తిగత శైలి’ అనే చర్చ మొదలైంది.ఆగస్టు 5న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తమిళంలో ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో పలుచోట్ల వ్యాకరణ, ఉచ్చారణ లోపాలు కనిపించాయని డీఎంకే ఎమ్మెల్యే టీ.ఎం. రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడాలి” అని తాజాగా జరిగిన చర్చలో ఆయన సూచించారు. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ వంటి కీలక ప్రసంగం చేస్తున్నప్పుడు భాషపై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.‘నా తమిళం.. నా స్టైల్’డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి మేరీ విల్సన్ తీవ్రంగా స్పందించారు. తన మాట్లాడే విధానాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. “నా తమిళం గురించి నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా ప్రత్యేక శైలి. నేను ఇలాగే మాట్లాడగలను. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇదే నా శైలి. మీ కోసం నేను మార్చుకోలేను” అంటూ మంత్రి ఘాటుగా బదులిచ్చారు.వివాదం పెరగడంతో అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యులు ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు అర్థం చేసుకునేలా మంత్రి ప్రసంగించారని, భాషపై చర్చను సానుకూలంగా చూడాలని కోరారు.మతం ప్రస్తావనతో మరింత వేడితనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ మంత్రి విల్సన్ తన మత విశ్వాసాలను ప్రస్తావించారు. “క్రైస్తవం నాకు ప్రేమ, సానుభూతి అనే ఒకే భాషను నేర్పింది. నేను బైబిల్ నుంచి దాన్ని నేర్చుకున్నాను. నేను పుట్టుకతో క్రైస్తవుడిని” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. భాషా వివాదంలోకి మత ప్రస్తావన రావడంపై పలువురు స్పందించారు.‘తప్పులను అంగీకరించాలి’: డీఎంకేడీఎంకే సీనియర్ నేత టీ.కే.ఎస్. ఇళంగోవన్ మంత్రి తీరుపై విమర్శలు చేశారు. “బడ్జెట్ చదివే సమయంలో అనేక చోట్ల తమిళంలో తప్పులు జరిగాయి. దాన్ని అంగీకరించకుండా సమర్థించుకోవడం సరికాదు. ఆర్థిక మంత్రి భాషను సరిగ్గా చదవగలగాలి” అని అన్నారు.తమిళంను అవమానించొద్దు: బీజేపీఈ వివాదంలో బీజేపీ కూడా జోక్యం చేసుకుంది. తమిళ భాషను తక్కువ చేసి మాట్లాడే వ్యాఖ్యలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. “మతం ఏదైనా కావచ్చు. కానీ భావోద్వేగం, గుర్తింపు పరంగా మనమంతా తమిళులమే. మీ మతాన్ని గౌరవించడంలో తప్పులేదు. కానీ తమిళ భాషను కించపరిచే వ్యాఖ్యలను అంగీకరించలేం. మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.విజయ్ సూచనతమిళ భాషపై రేగిన వివాదంపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి విల్సన్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. “తమిళం మన అస్తిత్వం.. దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. భాష విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి” అంటూ సూచించినట్లు సమాచారం.భాషా గౌరవమా? వ్యక్తిగత స్వేచ్ఛా?ఈ వివాదం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. ఒక వర్గం “తమిళం ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటి.. దాన్ని సరిగ్గా మాట్లాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అంటుండగా.. మరోవర్గం “భాషలో చిన్న తప్పుల కంటే ప్రజలకు అర్థమయ్యేలా పాలన అందించడం ముఖ్యం” అని వాదిస్తోంది. -
చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది
‘‘చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది’’ ఇది జనుల వాడకంలో ఉండి, అందరి నోళ్లలోనూ నానుతూ ఉన్న మాట. పాపం అంటే ఇతరులకు అపకారం చేసినందువల్ల వచ్చే ఫలితం. దీనిని మామూలు మాటల్లో చెప్పాలంటే తప్పు. అందరూ అంగీకరించనిది. మానవమాత్రులు తప్పు చేయకుండా ఉండటం అసంభవం. తెలిసి కాకపోయినా, తెలియకుండా అయినా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. తప్పు అంటే ఏదైనా ఇతరులకి బాధ కలిగించే పని కాని, ధర్మానికి విరుద్ధమైన పని కాని చేయటం. ఎదుటివారికి మంచి అనుకుని చేసినది వారికి హాని కలిగించవచ్చు. అనుకోకుండా చేసినట్టయితే దానిని ‘‘తప్పు అయి పోయింది’’ అని ఒప్పుకొని ఎవరికి హాని కలిగిందో వారిని క్షమించమని అడిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. పరిహారం సమర్పించో, మరొక విధంగానో సద్దుబాటు చేసుకునే వీలు ఉంటుంది. ధర్మానికి అపచారం జరిగితే? .. .. దానిని కూడా ఒప్పుకొని పరిహారానికి ప్రయత్నం చేయాలి. ఇవి చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అయితే పరిణామం వేరొక విధంగా ఉంటుంది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటే తాను చెప్పుకోవటమే కాదు. ఈ పాపం గురించి పదిమంది చెప్పుకుంటే అని. ఏదైనా విషయం గురించి ఎంత మంది మాట్లాడుకుంటే దాని ఫలితాన్ని అంతమంది పంచుకుంటారు కదా! ఆ విధంగా తాను చేసిన పనికి సంబంధించిన ఫలితాన్ని ఎంతోమంది పంచుకోవటం కారణంగా కర్తకి ఆ పనివల్ల కలగవలసిన తీవ్ర నష్టం సద్దుబాటు చేయబడుతుంది. ‘‘కర్తా కారాయితా చైవ ప్రేరకశ్చానుమోదకః / సుకృతే దుష్కృతే చైవ చత్వారినః సమ భాగినః’’. కారయితలు (చేయించినవారు), ప్రేరకులు కాకపోయినా దాని గురించి మాట్లాడుకున్నవారికి కొంత ఫలితం చెందుతుంది. కనుక కర్తకి స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని పనుల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాని, అది చేయకూడని పని అయితే చేయగలిగినది ఏమీ ఉండదు. తాను చేసిన తప్పుని చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం ధర్మమార్గంలో నడిచే వారికి మాత్రమే ఉంటుంది. ‘‘సత్యే ధర్మం ప్రతిష్ఠితా’’, ధర్మం సత్యంలోనే నిలిచి ఉంటుంది. కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు మాత్రమే ధర్మమార్గంలో ఉన్నట్టు. తన గొప్ప, ఘనతలు మాత్రమే కాక అపజయాలు, లోపాలు కూడా ఉన్నవి ఉన్నట్టుగా సందర్భం వచ్చినప్పుడు చెప్పగలగాలి. అప్పుడు అది ఎంతోమందికి మార్గదర్శక మౌతుంది. పొరపాట్లు ఎట్లా దొర్లుతాయి? వాటిని ఏ విధంగా అధిగమించ వచ్చు? అని అవగాహన చేసుకోవటానికి గుణపాఠం అవుతుంది. తాను చేసిన పాపం అందరికీ తెలిస్తే గౌరవం తగ్గిపోతుందనే భయం ఉంటుంది సాధారణంగా. వాస్తవానికి తాత్కాలికంగా అదే జరిగినా, రాను రాను గౌరవం పెరుగుతుంది. నిజాయితీపరులు, మంచి చెడు తెలిసిన వారు అని. ఒకరి ద్వారా తెలియటం కాక తామే చెప్పటం వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇతరులకి తెలిసి, వారు గోరంత విషయాన్ని కొండంత చేసి, ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఈ పారదర్శకత నాయకుడుగా ఉండేవారికి తప్పని సరి. చేసిన పాపం ఇతరులకి తెలిస్తే చులకన అయిపోతామేమో అనే ఆలోచనతో బయటికి చెప్పరు చాలమంది. చెప్పుకుంటే పరిహారం ఎట్లా చేయవచ్చో సూచనలు అందే అవకాశం ఉంటుంది. ఈ మాట అన్నంత మాత్రాన ప్రకటనలు చేయమని కాదు. శ్రేయోభిలాషుల వద్ద మనసులో ఉన్న బరువు దింపుకుంటే తేలిక అవుతుంది. లోలోపల కుమిలి పోవటం, బయట పడుతుందేమోననే భయం, ఆందోళన ఉండవు. అప్పుడు తరువాతి కర్తవ్యం గోచరిస్తుంది. ఇదంతా తప్పు చేశాననే భావన ఉన్న వారి విషయంలో. తప్పు అని ఒప్పుకోటానికే ఇష్టం లేనివారి గురించి చెప్పటానికి ఏమీ లేదు. – ఎన్.అనంతలక్ష్మి -
పకడ్బందీగా ఓటర్ల జాబితా
డూప్లికేట్ ఓటర్లను తొలగించాలి – ఓటర్ల జాబితాలోని తప్పులను సత్వరం సరిచేయాలి – పట్టణ ప్రాంతాల్లో ఇక 1000 – 1100 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సూచనలు కర్నూలు(అగ్రికల్చర్): 2019 సాధారణ ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా బోగస్ ఓటర్లకు తావు లేకుండా పకడ్బందీగా రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ అతిథిగహంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో జాతీయ ఓటర్ల పరిశుద్ధీకరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఉన్న డూప్లికేటు ఓటర్లను తొలగించేందుకు ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అచ్చుతప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని సరిచేయాలన్నారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ల జాబితాను, స్థానిక ఓటర్ల జాబితాను సరిపోల్చుకోవాలని సూచించారు. 2016 ఓటర్ల జాబితా సవరణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, వచ్చి వెళ్లేందుకు దారి, తదితర సదుపాయాలన్నీ ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా ట్యాబ్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. బీఎల్ఓ, ట్యాబ్ ఆపరేటర్ ప్రతి పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉన్న సదుపాయాలను పరిశీలించి ట్యాబ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రతి 1400 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉందని, 2019 ఎన్నికల నాటికి వెయ్యి నుంచి 1100 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల మ్యాప్‌లను తయారు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వివరించారు. ఓటర్ల జాబితా పరిశుద్ధీకరణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, డీఆర్వో గంగాధర్‌గౌడు, 14 నియోజకవర్గాల ఈఆర్వోలు, ఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు. -
‘మావో’ కూడా తప్పులు చేశాడు: జిన్‌పింగ్
బీజింగ్: నవచైనా నిర్మాత మావోజెడాంగ్ కూడా తప్పులు చేశాడని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వ్యాఖ్యానించాడు. అయితే దేశరూపరేఖలను మార్చిన విప్లవాత్మక నేతను ప్రజలు సరైన చారిత్రక దృక్పథంతో చూసి అర్థం చేసుకోవాలని కోరారు. గురువారం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా సమావేశంలో దేశ అధ్యక్షుడు, సీపీసీ జనరల్ సెక్రటరీ జి జిన్‌పింగ్ మాట్లాడుతూ దేశ రూపురేఖలను మార్చిన గొప్పవ్యక్తి మావో అని కొనియాడారు. మావో 120వ జయంతిని చైనా ఘనంగా నిర్వహించనున్నటు తెలిపారు. అంతకుముందు ఆయన బీజింగ్‌లో మావో సమాధిని సందర్శించి నివాళులర్పించారు.


