రష్యా చేరుకున్న మన్మోహన్ సింగ్ | Manmohan Singh reaches to Russia today | Sakshi
Sakshi News home page

రష్యా చేరుకున్న మన్మోహన్ సింగ్

Oct 20 2013 4:48 PM | Updated on Sep 1 2017 11:49 PM

భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు దేశాల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్నారు.

భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు దేశాల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్నారు. ఆదివారం ప్రత్యేక విమానంలో మాస్కో విచ్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మన్మోహన్ చర్చించనున్నారు.

సైనిక, అణు ఇంధనం, శాస్త్ర సాంకేతిక, రసాయనిక, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలున్నాయని మాస్కో బయల్దేరేముందు ఢిల్లీలో ప్రధాని వ్యాఖ్యానించారు. రష్యాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మన్మోహన్ అక్కడి నుంచి చైనా పర్యటనకు వెళతారు. ఆ దేశంతో సరిహద్దు సమస్యల గురించి చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement