అదృష్టంతో బతికిపోయింది..! | Man pushes woman on rail track | Sakshi
Sakshi News home page

అదృష్టంతో బతికిపోయింది..!

Oct 24 2017 5:34 PM | Updated on Oct 24 2017 5:46 PM

Man pushes woman on rail track

హాంగ్‌కాంగ్‌ : ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది. క్షణకాలం పాటు శరీరం భయంతో కంపించిపోయే సంఘటన.  పొరపాటున అటుగా రైలు వచ్చుంటే.. అన్న మాట తలపుకు వస్తేనే కాళ్ల కింద భూకంపం వచ్చే భయానక సన్నివేశం హాంగ్‌కాంగ్‌లో జరిగింది.

హాంగ్‌కాంగ్‌లోని యెన్‌లాంగ్‌ మెట్రో స్టేషన్‌లో రైలు కోసం ఒక యువతి ఎదురు చూస్తోంది. రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఆమె అటుఇటు తిరుగుతూ.. అటువైపున ఉన్న మిత్రులకు హాయ్‌ చెబుతోంది. ఇంతలో ఒక వ్యక్తి.. ఆమెను వెనక నుంచి హఠాత్తుగా రైల్వే ట్రాక్‌మీదకు తోసేసి.. తనకు ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు.

ట్రాక్‌ మీద పడ్డ యువతి.. తనకు ఏం జరిగింది? ఎందుకిలా పడ్డాను? అని అనుకుంటూ.. అటుగా వెళ్తున్న వ్యక్తిని గట్టిగా తిడుతోంది. ఆమె అదృష్టం బాగుండి.. అప్పటికే అటు రావాల్సిన రైలు ఆలస్యం కావడంతో ప్రాణాలతో బతికిపోయింది. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో.. నిందితుడిని కొద్ది సేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం నేరం కింద అతన్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ 3 లక్షల మందిదాకా చూశారు.

Advertisement
 
Advertisement
Advertisement