ట్రంప్ మీ అంతు చూస్తాడంటూ మహిళపై..! | Man Attacks Muslim Airline Employee and then arrested | Sakshi
Sakshi News home page

ట్రంప్ మీ అంతు చూస్తాడంటూ మహిళపై..!

Jan 28 2017 5:01 PM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్ మీ అంతు చూస్తాడంటూ మహిళపై..! - Sakshi

ట్రంప్ మీ అంతు చూస్తాడంటూ మహిళపై..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని తరిమేస్తాడు.. మీ అంతుచూస్తాడంటూ ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బందితో గొడవకు దిగి, చివరికి జైలుపాలయ్యాడు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని తరిమేస్తాడు.. మీ అంతుచూస్తాడంటూ ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బందితో గొడవకు దిగి, చివరికి జైలుపాలయ్యాడు. న్యూయార్క్ జాన్ ఎఫ్.కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో  ఈ ఘటన చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది, క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ అధికారుల కథనం ప్రకారం.. రాబిన్ రోడ్స్ అనే 57 ఏళ్ల వ్యక్తి బుధవారం సాయంత్రం ఎయిర్ పోర్టుకు వచ్చాడు. మసాచుసెట్స్ వెళ్లేందుకు కనెక్టింగ్ ఫైట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎయిర్ పోర్టుకు వచ్చినప్పటి నుంచీ అతడి ప్రవర్తన సరిగా లేదని, ఎయిర్ లైన్స్ లో పనిచేసే  మహిళా సిబ్బందిపై దాడి చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

డెల్టా స్కై ఎయిర్ పోర్టులో మహిళా సిబ్బంది రబీయా ఖాన్ ఛాంబర్ కు వెళ్లాడు. ఆఫీసులో పనిచేస్తున్నావా.. లేక నిద్రపోతున్నావా అంటూ ఆమెపై నోరు పారేసుకున్నాడు. తనతో ఎందుకు గొడవ పడుతున్నావని రబీయా ప్రశ్నించగా.. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ వచ్చేశారు. మీ ముస్లింలను తరిమేస్తాడు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు. ఆమెపై దాడికి దిగడంతో కుడికాలికి గాయాలయ్యాయి.  అక్కడినుంచి తప్పించుకోవాలని చూసిన ఆ మహిళను.. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ లో జరిగిన ఘటనలు పునరావృతం అవుతాయని  వార్నింగ్ ఇచ్చాడు.  

ఎయిర్ లైన్స్ సిబ్బంది ఈ విషయం తెలుసుకుని ప్యాసింజర్ రాబిన్ రోడ్స్ ను అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేస్తారని తెలుసునని, అయితే ట్రంప్ చెప్పినట్లే ముస్లింలను ఇక్కడ లేకుండా చేస్తారని విచారణలోనూ చెప్పాడు. రోడ్స్ కు దాదాపు నాలుగేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని జాతి, మత వివక్ష దాడులు చేయడం మంచిది కాదని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement