John F. Kennedy International Airport
-
కంప్యూటర్లు షట్‌డౌన్ : ప్రయాణికులు లాంగ్ క్యూ
అమెరికాలో పలు విమానశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ కంప్యూటర్లు రెండు గంటలకు పైగా షట్‌డౌన్ అయ్యాయి. దీంతో ఇయర్-ఎండ్ హాలిడేస్‌ను ముగించుకుని అమెరికాలోకి వస్తున్న ప్రయాణికులుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రాసెసింగ్ సిస్టమ్‌లో అంతరాయం రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభమైందని, రాత్రి 9.30కు ఈ సమస్యను పరిష్కరించినట్టు కస్టమ్స్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. అన్ని విమానశ్రయాల్లో సాధారణం కంటే ఎక్కువ సమయం సేపు ప్రయాణికులు క్యూలైన్లలో వేచిచూడాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో తమ సేవల అంతరాయం హానికరమైనది కాదు అనే ఎలాంటి సూచనను కూడా ఏజెన్సీ ఇవ్వలేదు. ఈ అంతరాయానికి వివరణ ఇవ్వకపోవడంతో, చాలా మంది ప్రయాణికులు, ప్రత్యామ్నాయ ప్రక్రియలను ఎంచుకున్నట్టు తెలిసింది. విదేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే ప్రయాణికులు, తాము వేచి ఉన్న లాంగ్ లైన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటాఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వంటి ఇతర ఎయిర్‌పోర్టులు దీని ప్రభావానికి గురయ్యాయి. గతేడాది కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. -
ట్రంప్ మీ అంతు చూస్తాడంటూ మహిళపై..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని తరిమేస్తాడు.. మీ అంతుచూస్తాడంటూ ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బందితో గొడవకు దిగి, చివరికి జైలుపాలయ్యాడు. న్యూయార్క్ జాన్ ఎఫ్.కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది, క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ అధికారుల కథనం ప్రకారం.. రాబిన్ రోడ్స్ అనే 57 ఏళ్ల వ్యక్తి బుధవారం సాయంత్రం ఎయిర్ పోర్టుకు వచ్చాడు. మసాచుసెట్స్ వెళ్లేందుకు కనెక్టింగ్ ఫైట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎయిర్ పోర్టుకు వచ్చినప్పటి నుంచీ అతడి ప్రవర్తన సరిగా లేదని, ఎయిర్ లైన్స్ లో పనిచేసే మహిళా సిబ్బందిపై దాడి చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. డెల్టా స్కై ఎయిర్ పోర్టులో మహిళా సిబ్బంది రబీయా ఖాన్ ఛాంబర్ కు వెళ్లాడు. ఆఫీసులో పనిచేస్తున్నావా.. లేక నిద్రపోతున్నావా అంటూ ఆమెపై నోరు పారేసుకున్నాడు. తనతో ఎందుకు గొడవ పడుతున్నావని రబీయా ప్రశ్నించగా.. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ వచ్చేశారు. మీ ముస్లింలను తరిమేస్తాడు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు. ఆమెపై దాడికి దిగడంతో కుడికాలికి గాయాలయ్యాయి. అక్కడినుంచి తప్పించుకోవాలని చూసిన ఆ మహిళను.. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ లో జరిగిన ఘటనలు పునరావృతం అవుతాయని వార్నింగ్ ఇచ్చాడు. ఎయిర్ లైన్స్ సిబ్బంది ఈ విషయం తెలుసుకుని ప్యాసింజర్ రాబిన్ రోడ్స్ ను అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేస్తారని తెలుసునని, అయితే ట్రంప్ చెప్పినట్లే ముస్లింలను ఇక్కడ లేకుండా చేస్తారని విచారణలోనూ చెప్పాడు. రోడ్స్ కు దాదాపు నాలుగేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని జాతి, మత వివక్ష దాడులు చేయడం మంచిది కాదని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ సూచించారు. -
విమానంలో అమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని!
న్యూయార్క్: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పై ఓ వ్యక్తి వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రయాణికుడిని విమానం నుంచి బలవంతంగా దించేశారు. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్.కెన్నడీ ఎయిర్ పోర్టులో గురువారం ఈ తతంగం జరిగింది. ప్యాసెంజర్ ను విమానం నుంచి దింపివేసినట్లు జెట్ బ్లూ ఎయిర్ వేస్ వెల్లడించింది. మరో ప్రయాణికుడు మార్క్ షెఫ్ ఈ విషయంపై స్పందించాడు. విమానంలో ఎక్కిన గుర్తుతెలియని వ్యక్తి భర్తతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఇవాంకా వద్దకు వెళ్లాడు. 'ఓ మై గాడ్.. ఇది నిజంగానే నాకు పీడకల. మీరు దేశాన్నే కాదు విమానాలను వదిలిపెట్టడం లేదు అంటూ ట్రంప్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు' అని మార్క్ షెఫ్ వివరించాడు. జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ సిబ్బంది మాట్లాడుతూ.. ఆ ప్యాసింజర్ ఇవాంకా, ఆమె భర్తతో దురుసుగా ప్రవర్తించాడు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. మేం ఎంతగానో వారించాం.. మర్యాదగా వెళ్లి సీట్లో కూర్చోవాలని సర్దిచెప్పగా మాటలు పేల్చుతూనే ఉన్నాడు. దీంతో ఓపిక నశించిన సిబ్బంది, ఇతర ప్రయాణికులకు అసౌక్యం కలకకూడదని భావించి అతడి విమానం నుంచి దింపివేసిట్లు చెప్పారు. అయితే మరో విమానంలో అతడికి అవకాశం ఇచ్చి సహకరించినట్లు తెలిపారు. వాస్తవానికి విమానంలో ఏం జరిగింది, ప్యాసింజర్ పేరు ఏంటన్న వివరాలను ఎయిర్ లైన్స్ సిబ్బంది బహిర్గతం చేయలేదు.