మడోన్నా అరుదైన చిత్రం షేర్‌ చేసింది | Madonna shares picture of all her adopted children | Sakshi
Sakshi News home page

మడోన్నా అరుదైన చిత్రం షేర్‌ చేసింది

Feb 24 2017 12:53 PM | Updated on Jul 26 2019 5:58 PM

ప్రముఖ హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ మడోన్నా తాను దత్తత తీసుకున్న నలుగురు పిల్లల ఫొటోలను షేర్‌ చేసింది. వీరిలో ఇటీవలె దత్తత తీసుకున్న ఎనిమిదేళ్ల కవల బాలికలు కూడా ఉన్నారు.

లాస్‌ ఏంజెల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ మడోన్నా తాను దత్తత తీసుకున్న నలుగురు పిల్లల ఫొటోలను షేర్‌ చేసింది. వీరిలో ఇటీవలె దత్తత తీసుకున్న ఎనిమిదేళ్ల కవల బాలికలు కూడా ఉన్నారు. వీరిని మలావి నుంచి దత్తత తీసుకుంది. ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ ఫొటోను షేర్‌ చేసుకున్న 68 ఏళ్ల ఈ మ్యూజిక్‌ ఐకాన్‌ తామంతా పైజామా పార్టీలో చాలా హ్యాపీగా ఉన్నామంటూ ట్యాగ్‌లైన్‌ పెట్టింది. తమ ఇంట అసలైన సంతోషం నేడే వెల్లి విరుస్తోందంటూ రాసుకొచ్చింది.

మడోన్నా మొత్తం నలుగురు పిల్లలను దత్తత తీసుకుంది. వీరిని ఇప్పటి వరకు సరిగా మీడియాకు చూపించని ఆమె తొలిసారి పంచుకున్నారు. వారి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతుందనే ఆమె ఇన్ని రోజులపాటు వారి వివరాలను తెలియనివ్వడం లేదని చెబుతున్నారు. మడోన్నాకు ఇద్దరు కన్నబిడ్డలు ఉన్నారు. లార్డెస్‌(19) అనే కూతురుతోపాటు రాకో(15) అనే కుమారుడు ఉన్నాడు. వీరితోపాటు స్టెల్లా, వాలే, డేవిడ్‌ బాందా, మెర్సీ అనే నలుగురు దత్తత పిల్లలు అదనం.

Advertisement
 
Advertisement
Advertisement