బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టకుండా.. చిన్న చిట్కా! | Long night fasting may cut risk of breast cancer recurrence | Sakshi
Sakshi News home page

బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టకుండా.. చిన్న చిట్కా!

Apr 1 2016 1:55 PM | Updated on Oct 16 2018 2:49 PM

బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టకుండా.. చిన్న చిట్కా! - Sakshi

బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టకుండా.. చిన్న చిట్కా!

రాత్రి భోజనం తరువాత విరామం ఎక్కువ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది .

ఒకసారి క్యాన్సర్ బారిన పడి, చికిత్స చేయించుకున్నవారికి మళ్లీ ఆ వ్యాధి తిరగబెడుతుందనే ఆందోళన తక్కువేమీ కాదు. రొమ్ము క్యాన్సర్ పునరుక్తిని తగ్గించేందుకు  చిన్న చిట్కాను పాటించాలని  పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి భోజనం తర్వాత విరామం ఎక్కువ  ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది.


రాత్రి ఎక్కువసేపు ఉపవాసం ఉండటం ఈ వ్యాధి మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. 1995, 2007 మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ పునరుక్తి,  కొత్త ట్యూమర్లు రావడం, వారి ఆహార పద్ధతులు, నియమాలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇప్పటికే వ్యాధితో పోరాడిన దాదాపు 2వేల మందిపై జరిపిన కొత్త పరిశోధనలో ఈ అంశం తేలిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకురాలు కేధరీన్ మారినాక్ తెలిపారు. రాత్రిపూట భోజనం తర్వాత విరామం 13 గంటల కంటే తక్కువ కాకుండా ఉంటే ప్రారంభదశలోనే రొమ్ము కాన్సర్ చికిత్స పొందిన మహిళల్లో తిరిగి కణితులు ఏర్పడే అవకాశం 36 శాతం తగ్గిందని వెల్లడించారు.

భోజనం తరువాత వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఎక్కువే అంటున్నారు. ఎక్కువ సేపు నిద్ర, రాత్రి ఎక్కువ భోజన విరామం  గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్‌ను ప్రభావితం చేస్తుందన్నారు. దీంతోపాటు ఇతర క్యాన్సర్ల  ప్రమాదం, టైప్  2 మధుమేహం, గుండె రక్తనాళాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. రాత్రిపూట ఉపవాస విరామం తగినంత పొడిగించుకొని దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవాలని పరిశోధకులు సూచించారు. జామా ఆంకాలజీ అనే పత్రికలో ఈ పరిశోధనా పత్రం  ప్రచురితమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement