ఆమె ఒంటరైపోయారు..! వైరల్‌ ఫొటో | Lonely Photo Of UK PM Theresa May goes viral | Sakshi
Sakshi News home page

ఆమె ఒంటరైపోయారు..! వైరల్‌ ఫొటో

Oct 21 2017 8:13 PM | Updated on Oct 21 2017 8:13 PM

Lonely Photo Of UK PM Theresa May goes viral

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిసా మే ఒంటరిగా కూర్చున్న ఫొటో ఒకటి.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ఉద్దేశించిన 'బ్రెగ్జిట్‌ చర్చల్లో' భాగంగా ఆమె ఓ చాంబర్‌లో ఒంటరిగా కూర్చుని.. ఇతరుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోను ఉపమానంగా వాడుకొని థెరిసా మేపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈయూ నుంచి బ్రిటన్‌ తప్పుకొని ఒంటరైపోతున్న వైనానికి ఈ ఫొటో నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

బ్రెగ్జిట్‌ చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్చల్లో భాగంగా ఆమె యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌తో చర్చల కోసం గదిలో ఒంటరిగా ఎదురుచూస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది కావడంతో ఈ విషయమై నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మధ్యంతర పార్లమెంటు ఎన్నికలకు వెళ్లి చేజేతులా పార్టీ మెజారిటీ కోల్పోయిన థెరిసా..ఇటు సొంత కన్జర్వెటీవ్‌ పార్టీలో, అటూ బ్రెగ్జిట్‌ చర్చల్లోనూ ఒంటరి అయిపోయారు. ఈయూలోని 27 దేశాలు ఒకవైపు మోహరించగా.. బ్రిటన్ మరోపక్షంగా ఆమె బ్రెగ్జిట్‌ చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తీరుపై సెటైర్లు, ఘాటు వ్యాఖ్యలతో ఈ ఫొటోను నెటిజన్లు షేర్‌ చేసుకుంటున్నారు. 'పూర్‌ థెరిసా మే' అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement