లండన్‌ బ్రిడ్జి ఉగ్రవాది.. పాత నేరస్తుడే

London Bridge attacker Usman Khan had been jailed bomb London Stock Exchange - Sakshi

లండన్‌: లండన్‌లోని ‘లండన్‌ బ్రిడ్జి’పై శుక్రవారం కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉగ్రవాది ఉస్మాన్‌ఖాన్‌(28) గతంలో ఉగ్రవాద నేరాలపై ఏడేళ్ల క్రితం శిక్ష అనుభవించిన విషయాన్ని స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు వెల్లడించారు. లండన్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజిపై బాంబు దాడికి యత్నించినందుకు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నడిపినందుకు ఉస్మాన్‌ఖాన్‌కు గతంలో జైలుశిక్ష పడింది.  జైలు శిక్ష అనుభవిస్తున్న ఉస్మాన్‌.. పెరోల్‌పై బయటికొచ్చి శుక్రవారం లండన్‌ బ్రిడ్జిపై పేట్రేగిపోయాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉస్మాన్‌ మరో ముగ్గురిని గాయపరిచాడు. ఉస్మాన్‌కు ఉగ్రనేరాలపై 2012లో శిక్ష పడింది. 2018లో లైసెన్స్‌ (పెరోల్‌)పై జైలు నుంచి విడుదలయ్యాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top